- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking: చంద్రబాబుకు షాక్.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సీఐడీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ మాత్రం చంద్రబాబును వదలడంలేదు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ తొలి నుంచి కేసు విచారణలో సీఐడీ వాదించింది. ఇప్పుడు కూడా అదే వాదనను కొనసాగిస్తోంది. చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ కొట్టివేయాలంటూ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్ఫీ దాఖలు చేయనున్నారు. స్కిల్ స్కాం కేసులో హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని హైకోర్టు నిర్ధారిస్తూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై సీఐడీ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉండగా ట్రయల్ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని సీఐడీ న్యాయవాదులు అంటున్నారు. అటు ఏపీ ప్రభుత్వం సైతం హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో చంద్రబాబు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జీవితంగడిపారు. జైల్లో చంద్రబాబుకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. అయితే ఆరోగ్య పరమైన సమస్యలు మరిన్ని ఉండటంతో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు, సీఐడీ వాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ తీర్పుపై సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.