BIG BREAKING : వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. అయినా జైల్లోనే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-16 13:32:24  IST  )

గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ (Vallabhaneni Vamsi Bail) మంజూరైంది.

BIG BREAKING : వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. అయినా జైల్లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ (Vallabhaneni Vamsi Bail) మంజూరైంది. ఈ కేసులో సీఐడీ కోర్టు (CID Court) వంశీకి బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో (Gannavaram TDP Office Attack Case) వంశీ ఏ71 గా ఉన్నారు. ఇప్పటికే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి బెయిల్ రాగా.. మిగతా కేసుల్లో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా మరో కేసులో బెయిల్ వచ్చినా.. ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ లో ఉన్న కారణంగా వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

కాగా.. తనకు ఆరోగ్యం బాలేదని లాయర్ ద్వారా వంశీ కోర్టుకు విన్నవించగా.. హెల్త్ టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉన్న కేసులకు మరో కేసు యాడ్ అయింది. గన్నవరంలో ఆయన అక్రమ మైనింగ్ (Gannavaram Mining Case)కు పాల్పడ్డారంటూ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. 2019-2024 వరకూ వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు ఉన్నాయని, సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story