Good Friday: వైయస్ జగన్‌కు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనం

by Vemula.Srinu Prasad |

గుడ్ ఫ్రైడే త్యాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినమని, ఈస్టర్ పర్వదినం ఆశ, పునర్జన్మ, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని వైయస్‌ జగన్‌ అన్నారు. ..

Good Friday: వైయస్ జగన్‌కు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనం
X

దిశ, వెబ్ డెస్క్: గుడ్ ఫ్రైడే(Good Friday) త్యాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినమని, ఈస్టర్(Eestar) పర్వదినం ఆశ, పునర్జన్మ, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని వైయస్‌ జగన్‌(Ys Jagan) అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందాలన్నారు. ప్రతి కుటుంబం ఆనందంతో, ఆరోగ్యంతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.


Next Story