- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srikalahasti Brahmotsavam: సీఎం జగన్‌కు ఆహ్వానం
by Vemula.Srinu Prasad |
శ్రీకాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు ఆహ్వానించారు. ..

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు ఆహ్వానించారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం వేదపండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికనూ అందజేశారు.
Next Story






