- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల జలాశయాల్లో జలకళ
ఇటీవల కురుస్తున్న వర్షాలకు తిరుమల క్షేత్రంలోని జలశయాలు జలకళను సంతరించుకున్నాయి.

దిశ, వెబ్ న్యూస్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు తిరుమల క్షేత్రంలోని జలశయాలు జలకళను సంతరించుకున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ద్వారా భక్తులకు కావాల్సిన నీటి అవసరాలను టీడీడీ తీరుస్తోంది. అయితే వర్షాల కారణంగా వస్తున్న వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో అధికారులు ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు పేర్కొన్నారు.
2833 లక్షల గ్యాలన్ల సామర్ధ్యం కలిగిన గోగర్భం డ్యామ్ లో 2804 లక్షల నీళ్లు చేరడం తో పూర్తిగా నిండిపోయింది. పాపవినాశనం డ్యామ్ సామర్థ్యం 5240 లక్షల గ్యాలన్లు కాగా అందులో 4890.65 లక్షల గ్యాలన్ల నీరు చేరింది. ఆకాశగంగ డ్యామ్ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా అందులో 537 లక్షల గ్యాలన్లు, కుమారధార డ్యామ్ నిల్వ సామర్థ్యం 4258.98 లక్షలు కాగా అందులో 3739.05 లక్షల గ్యాలన్లు, పసుపుధార డ్యామ్ నిల్వ సామర్థ్యం 1287.51 లక్షల గ్యాలన్లు కాగా 548.16 లక్షల గ్యాలన్లు నీరు చేరాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు పర్యాటకులు, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.






