Breaking: తిరుమలలో ఎయిర్ గన్ కలకలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-09 12:15:31  IST  )

తిరుమలలో అనుమతి లేని వస్తువు కలకలం రేపింది...

Breaking: తిరుమలలో ఎయిర్ గన్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో అనుమతి లేని వస్తువు కలకలం రేపింది. ఓ భక్తుడు కారు(Car)లో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే వాహన తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుమల వాహన తనిఖీ కేంద్రం వద్ద జరిగింది. వాహన తనిఖీ కేంద్రం(Vehicle Inspection Centre) దగ్గర రోజు మాదిరిగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.


ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన భక్తుడు మహేశ్ కారులో అక్కడికి వెళ్లారు. అయితే అతని కారులో ఎయిర్ పిస్టల్‌ను పోలీసులు గుర్తించారు. ఎయిర్ పిస్టల్, టెలీస్కోప్ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండపైకి ఎయిర్‌గన్‌కు అనుమతి లేదని చెప్పడంతో కారుతో సహా భక్తుడు మహేశ్ వెనుదిరిగి వెళ్లిపోయారు.

Next Story