చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి చిన్నారులు మృతి

by Naga Rani Yarlagadda |

సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. యాదమరి మండలం కొయ్యూరు వద్ద ఉన్న కొత్త చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాద వశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులు తుమ్మెదపాలేనికి చెందిన సిద్ధు (11), సోమిరెడ్డిపల్లికి చెందిన అభిలేశ్ (13)గా గుర్తించారు. చిన్నారుల మరణవార్త తెలిసి అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story