- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cm Jagan ఇలాకలో దారుణం... నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తుల హత్య
వైఎస్ఆర్ కడప జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం తాగి ఇంటికి వెళ్లేందుకు బార్‌నుంచి బయటకు వచ్చిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు...

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం తాగి ఇంటికి వెళ్లేందుకు బార్‌నుంచి బయటకు వచ్చిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కడప టౌన్‌కు చెందిన రేవంత్ (27), అభిలాష్ (29) ఇద్దరూ స్నేహితులు. సాయిబాబా థియేటర్‌కు సమీపంలోని రఘు బార్‌కు వెళ్లి మద్యం సేవించారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు బార్‌నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన రేవంత్, అభిలాష్‌పై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రేవంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అభిలాష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు స్పందించి అభిలాష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిలాష్ మృతి చెందినట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.






