- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: గోవిందరాజస్వామి రథానికి ఏమీ కాలేదు: టీటీడీ
తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని టీటీడీ తెలిపింది. ...

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని టీటీడీ తెలిపింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయిందని పేర్కొంది. గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
మరోవైపు తిరుపతి ఫోటో ప్రేమ్స్ తయారీ షాప్‌లో మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో మాడవీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో నాలుగంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. సమీప భవనాలకు సైతం మంటలు వ్యాపిస్తున్నాయి. షాపు ఎదుట ఉన్న బైక్‌లు సైతం దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.






