- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోకెన్లు లేకున్నా శ్రీవారి సర్వదర్శనం.. TTD సంచలన నిర్ణయం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటి నుంచే టీటీడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి(Tirumala Vaikuntha Dwara darshan) ఇప్పటి నుంచే టీటీడీ అధికారులు(TTD Officials) కసరత్తులు చేస్తున్నారు. శ్రీవారిని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొక్కిసలాట దృష్ట్యా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ఇక శ్రీవారి వైకుంట ద్వార దర్శనాలను డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు కల్పించాలని నిర్ణయించారు. అయితే నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈడిప్ ద్వారా టోకెన్లు పంపిణీ చేయనున్నారు. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే మొదటి 3 రోజులు పాటు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఆ తర్వాత 7 రోజులు సర్వదర్శనం (ఉచితం) ఉంటుందని తెలిపారు. టోకెన్లు లేకుండా భక్తులు దర్శనానికి వెళ్లవచ్చని చెప్పారు. తిరుమల, తిరుపతి వాళ్లకు 6, 7, 8వ తేదీ ఆన్ లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.






