- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల కల్యాణకట్టకు భారీ విరాళం
టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళంగా అందింది.

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ(TTD)కి మరో భారీ విరాళం అందిందింది. ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్ల(Silver Max Half Blades)లను చైర్మన్ బీ.ఆర్.నాయుడు(B.R. Naidu)కు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దాత బోడుపల్లి శ్రీధర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7'ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు బోడుపల్లి శ్రీధర్ పేర్కొన్నారు.
Next Story






