- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళవారం చంద్రగ్రహణం.. ఆ ఆలయాలన్నీ మూసివేత
మంగళవారం చంద్రగ్రహణం కారణంగా తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోని స్థానికాలయాలను మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం చంద్రగ్రహణం కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోని స్థానికాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి అదే రోజు రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆయా ఆలయాల్లో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని టీటీడీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని, ఈ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ ఆలయాలన్ని మూసివేత
‘‘తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుపతి కోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరం వేణుగోపాలస్వామి, నాగలాపురం వేదనారాయణ స్వామి, బుగ్గ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయం, నగరి కరియమాణిక్యస్వామి ఆలయం, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వాయల్పాడు పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి, రాత్రి 7:30 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు.’’ అని టీటీడీ వెల్లడించింది.






