- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల నుంచి అక్రమ వసూళ్లు.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
by Ramesh Naini |
శ్రీవారి సేవల పేరిట భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన టీటీడీ ఉద్యోగి గిరిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీవారి సేవల పేరిట భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన టీటీడీ ఉద్యోగి గిరిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. టీటీడీ పరిధిలోని కురుక్షేత్ర శ్రీవారి ఆలయంలో షరాఫ్‌గా పనిచేస్తున్న ఇతను.. అన్నదానం, కల్యాణోత్సవం, వాహన సేవల పేరుతో భక్తులను బురిడీ కొట్టించి పెద్ద ఎత్తున నగదు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం లోతైన విచారణ కొనసాగుతోంది.
Next Story






