- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు TTD కూల్ న్యూస్... వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
ఎండల వేడిమికి తిరుమల భక్తులకు టీటీడీ కూల్ న్యూస్ చెప్పింది.. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది...

దిశ, వెబ్ డెస్క్: ఎండల వేడిమికి తిరుమల భక్తులకు టీటీడీ(TTD) కూల్ న్యూస్ చెప్పింది.. వేసవి సెలవుల నేపథ్యంలో(Summer holidays) భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులకు అత్యవసర సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించింది. వేసవి తాపం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వేసవి ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భక్తుల అవసరాలు తీర్చేందుకు రూ.3.21 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. రింగ్ రోడ్డులోని 'బాటగంగమ్మ ఆలయం' నుంచి జిగ్‌జాగ్ (మెలికలు తిరిగే) బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తీవ్రమైన వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేలా షెడ్లు, తాత్కాలిక విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
కొండపైకి వెళ్లే భక్తుల కోసం...
ఇక కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల కోసం మార్గమధ్యలో అన్నప్రసాదం, తాగునీటి పంపిణీతో పాటు విశ్రాంతి మండపాల ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక మాడ వీధులు, ఇతర ప్రాంతాలలో "కూల్ పెయింట్" వేయడానికి, అవసరమైన చోట అదనపు షెల్టర్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇప్పటికే షెల్టర్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నాలుగు మాడ వీధులతోపాటు వరాహస్వామి అతిథి గృహం, సేవా సదన్ పరిసర ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1- 2 లోపల కూల్ పెయింట్ వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రధాన కల్యాణకట్ట, ఆస్థాన మండపం, PAC-4 రాంభగీచా వద్ద షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.






