- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కుండపోత వర్షం
by Vemula.Srinu Prasad |
తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ భక్తులకు వరుణుడు ఊరటనిచ్చాడు. ..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ భక్తులకు వరుణుడు(Rain) ఊరటనిచ్చాడు. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా తిరుమల వీధులన్నీ జలమయమయ్యాయి.
వర్షపు నీటితో మాడ వీధులు
ఈ అకస్మిక వర్షంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు, కాలినడకన వస్తున్న యాత్రికులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, ఎండ వేడిమి నుండి ఉపశమనం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాలు, మాడ వీధులు వర్షపు నీటితో నిండిపోగా.. ముందస్తు జాగ్రత్తగా అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






