- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: సీఎం పరట్యన.. టీడీపీ నేత శింగం చెట్టి హౌస్ అరెస్ట్
by Vemula.Srinu Prasad |
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఆరు రోజులుగా రిలే నిరాహార,దీక్ష చేపడుతున్నారు. ...

X
దిశ, తిరుపతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఆరు రోజులుగా రిలే నిరాహార,దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు శింగం శెట్టి సుబ్బరామయ్య మద్దతు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు బయల్దేరిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ తిరుపతి పర్యటనలో భాగంగా తెలుగుదేశం నాయకులను దీక్ష శిబిరం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేత సింగం చెట్టి మండిపడ్డారు. ఇంటి వద్ద నుంచే నిరసన కార్యక్రమం కొనసాగించారు. పండుగ రోజు కూడా హౌస్ అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని శింగం శెట్టి సుబ్బరామయ్య హెచ్చరించారు.
Next Story






