ఆయన అంబటి కాదు.. ఆంబోతు రాంబాబు: జనసేన నేత కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ స్టిక్కర్‌తో తిరుమల పర్యటన చేయడాన్ని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తప్పు బట్టారు..

ఆయన అంబటి కాదు.. ఆంబోతు రాంబాబు: జనసేన నేత కిరణ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సోమవారం తిరుమల(Tirumala) పర్యటనలో వైఎస్ జగన్(YS Jagan) స్టిక్కర్ ఉన్న చొక్కాతో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Janasena leader Kiran Royal) స్ట్రాంగ్‌గా స్పందించారు. ఆయన అంబటి రాంబాబు కాదని, ఆంబోతు రాంబాబు అని విమర్శించారు. చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అంబటి రాంబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబుకు ఇంగిత జ్ఞానం లేదని, ఉంటే జగన్ స్టిక్కర్ ఉన్న చొక్కా వేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారని విమర్శించారు. అంబటి రాంబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు(TTD Vigilance Officers) ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక గంట సేపు చొక్కా విప్పి దర్శనం చేసుకుంటే ఏం అవుతుందని నిలదీశారు. ఆ స్టిక్కర్‌తో అంబటి రాంబాబు తిరుమలకు రావడం కాదని, జగన్ ఇంటి చుట్టూ తిరగాలని కిరణ్ రాయల్ సలహా ఇచ్చారు.

Next Story