తిరుమలలో మద్యం బాటిళ్లు.. పోలీసుల కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

తిరుమలలో లభ్యమైన మద్యం బాటిళ్లపై తిరుపతి జిల్లా పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు..

తిరుమలలో మద్యం బాటిళ్లు.. పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల పోలీసుల(Tirumala Police) అతిథి గృహం సమీపంలో మద్యం బాటిళ్ల(Liquor Bottles) కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయనే అంశంపై కొన్ని సోషల్ మీడియా వార్తా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, వాస్తవ పరిస్థితులను తిరుపతి(Tirupati) జిల్లా పోలీసులు వివరణ ఇచ్చారు. మద్యం బాటిళ్లు లభ్యమైన ప్రదేశం, పోలీసు అతిథి గృహానికి ప్రత్యక్ష సంబంధం లేనిదని చెప్పారు. బాలాజీ కాలనీ(Balaji Colony) సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడ వెనుక చెట్ల పొదల దగ్గర బాటిళ్లు లభ్యమయ్యాయని, పోలీసు అతిథి గృహం ఆ ప్రదేశానికి సుమారు 25–50 అడుగుల ఎత్తులో గుట్టపై ఉందని చెప్పారు. రెండు ప్రదేశాలకు నేరుగా సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయడం సరైంది కాదని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు.

రోడ్ మార్జిన్‌లోనే మద్యం బాటిళ్లు

భక్తులు, వాహనదారులు ఉపయోగించే రోడ్ మార్జిన్ వద్ద వాహనాలు నిలిపి ఉంచే లొకేషన్ సమీపంలోనే ఈ బాటిళ్లు పడివున్నట్లు గుర్తించారని తిరుపతి జిల్లా పోలీసులు పేర్కొన్నారు. బాటిళ్లను పరిశీలించగా అవి పాత బాటిల్ లాగా కనిపిస్తోందన్నారు. ఎక్సైజ్ శాఖతో కలిసి, వాటి సరఫరా వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తాగినవారు యాదృచ్ఛికంగా పడేయడం జరిగిందా?, లేక ఉద్దేశ్యపూర్వకంగా పాత బాటిల్‌ను తీసుకొని వచ్చి పెట్టారా అనే దాని పై సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించడం ‌తో పాటు, అన్ని విధాలుగాను లోతైన విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. తిరుమల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ SHOని పిలిపించి వివరణ తీసుకున్నామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో టీటీడీ, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో పనిచేస్తున్నారని, ఎవరి నిర్లక్ష్యం, ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు.

Next Story