తిరుమల వీకెండ్ ఎఫెక్ట్.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ

by Ramesh Naini |

వీకెండ్ సమీపిస్తుండటంతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.

తిరుమల వీకెండ్ ఎఫెక్ట్.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వీకెండ్ సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలైన్లు

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కంపార్టుమెంట్లు దాటి బయటకు వచ్చి, కృష్ణతేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు విస్తరించాయి. వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండటంతో టీటీడీ అధికారులు వారికి అవసరమైన తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో సహకరించాలని, దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు, ఆదాయ వివరాలను టీటీడీ విడుదల చేసింది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

*దర్శనం చేసుకున్న భక్తులు: 68,754 మంది.

*హుండీ ఆదాయం: రూ. 3.68 కోట్లు.

*తలనీలాలు సమర్పించిన వారు: 25,569 మంది.

Next Story