- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala | రేపు శ్రీవారి ఫిబ్రవరి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవలైన (Arjitha Sevalu) సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను రేపు (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవలైన (Arjitha Sevalu) సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను రేపు (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలని అధికారులు తెలిపారు. సొమ్ము చెల్లించిన వారికే టికెట్లు మంజూరవుతాయన్నారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ (TTD Online) లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24 ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25 ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.






