- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల : ఒక్క యాగం.. 9 టన్నుల పుష్పాలు
తిరుమలలో ప్రతి ఏడాది పుష్ప యాగాన్ని నిర్వహిస్తారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో ప్రతి ఏడాది పుష్ప యాగాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా కన్నుల పండుగగా పుష్ప యాగం (Pushpa Yagam) నిర్వహించారు. యాగం కోసం దాదాపు 9 టన్నుల పువ్వులను వినియోగించారు. అందులో 16 రకాలు పువ్వులు ఉండగా ఆరు రకాల పత్రాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్ప యాగం జరుగుతుందన్నారు. అందులో భాగంగా 16 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో ఉత్సవ మూర్తులను అభిషేకిస్తారని వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ యాగం జరుగుతుందన్నారు. 15వ శతాబ్దంలో ఆచరణలో ఉండేదని పేర్కొన్నారు. 1980 తరువాత తిరిగి ఆచరణలోకి వచ్చిందని తెలియజేశారు.
పుష్పయాగంలో గులాబీలు, సన్న జాజులు, తామర పువ్వులు, బంతి పువ్వులు, మల్లెపూలు వంటి పుష్పాలను వినియోగించారు. పుష్పయాగం నేపథ్యంలో తిరుమల (Tirumala) కొండ వివిధ వర్ణాల రంగులీనుతూ, పూల పరిమళాలను వెదజల్లుతూ ఆధ్యాత్మిక శోభతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది. యాగం కోసం కావాల్సిన పువ్వులను భక్తులు టీటీడీకి విరాళంగా అందజేయగా, వాటిలో ఐదు టన్నుల తమిళనాడు నుంచి రెండు టన్నుల చొప్పున ఆంధ్రప్రదేశ్, కర్నాటకల నుంచి టీటీడీకి చేరాయి. ఉదయం స్నపన తిరుమంజనంతో మొదలైన పుష్పయాగం ఉత్సవాలు పుష్పాభిషేకంతో ఘనంగా ముగిశాయని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సేవకులు గోవింద (Govinda) నామాన్ని స్మరిస్తూ పూల బుట్టలను యాగం కోసం తమ భుజాన మోసుకొచ్చారు.






