Tirumala: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్‌ శేష వస్త్రం సమర్పణ

by Vemula.Srinu Prasad |

తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్‌ శేష వస్త్రాన్ని సమర్పించారు..

Tirumala: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్‌ శేష వస్త్రం సమర్పణ
X

దిశ, తిరుమల: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్‌ శేష వస్త్రాన్ని సమర్పించారు. గత నెల 12వ తేదీ నుంచి జనవరి 5 వరకు వేంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవాలు నిర్వహించిన విషయం విధితమే. ఈ అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దక్షిణ మాడ వీధిలోని తిరుమల నంబి ఆలయానికి వేంచేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి శ‌నివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం తిరుమల నంబి శ్రీవారి ఆలయం చెంతకు వేంచేపుగా చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలనంబికి మేల్‌చాట్‌ శేష వస్త్రాన్ని శాస్త్రోక్తంగా సమర్పించారు. వైష్ణవ భక్తాగ్రేసరుడు వేంకటేశ్వర స్వామి సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడే తిరుమలనంబి. వీరు సాక్షాత్తు భగవత్‌ రామానుజాచార్యులకి స్వయానా మేనమామ కావడం విశేషం. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Next Story