Tirumala | టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-19 02:54:46  IST  )

టీటీడీ ట్రస్టులకు (TTD Trust) సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.

Tirumala | టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ ట్రస్టులకు (TTD Trust) సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా టీటీడీకి మరోసారి భారీ విరాళం (Donations) అందించారు. హెచ్ సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్ (Roshani Nadar) మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీటీ బోర్డు ట్రస్టుకు రూ.2కోట్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెక్కును అందుకున్నారు.

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారంశ్రీవారిని 66,966 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story