- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala | టోకెన్ లేకుండా సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిఖ సంఖ్యలో తిరుమల కొండకు తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిఖ సంఖ్యలో తిరుమల కొండకు తరలివస్తున్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తుల క్యూలైన్లో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దర్శనానికి 24 గంటల సమయం పడుతుందన్నారు. మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 68,615 మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 27,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.23 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నేటి నుంచి డిసెంబర్ 4 వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం జరగనుందని అధికారులు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయన్నారు. ఉదయం పంచమీతీర్థం, రాత్రి ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.






