- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiruchanur | పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి సారె
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి (Padmavati Ammavaru) బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి (Padmavati Ammavaru) బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లోని చివరి ఘట్టంలో భాగంగా అమ్మవారికి పంచమీ తీర్థం (Panchami Teertham) ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. శ్రీవారిపై యదపై కొలువుదీరిన లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం జరిపించారు. ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు నిర్వహించారు. సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించారు. అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా పద్మపుష్కరిణి వద్ద అమ్మవారికి సారెను సమర్పించారు. ప్రతి ఏటా పంచమీ తీర్థం నాడు తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 12.20 గంటల వరకు పంచమీ తీర్థం (చక్రస్నానం) నిర్వహణకు ముహూర్తం నిర్ణయించారు.






