మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం: ప్రభుత్వానికి వైవీ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కోర్టులో సీబీఐనివేదిక నేపథ్యంలో అధికార కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది..

మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం: ప్రభుత్వానికి వైవీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ కేసు(Tirumala laddu adulteration case)లో కోర్టు(Court)లో సీబీఐ(Cbi) నివేదిక సమర్పించిన నేపథ్యంలో అధికార కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తమ హయాంలో శ్రీవారి లడ్డూలో జంతు అవశేషాలు కలవలేదని సీబీఐ తేల్చిందని, కానీ కూటమి నాయకులే తమపై దుష్ర్పచారం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని, కానీ బుకాయిస్తున్నారని కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్

ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Former TTD Chairman, MP YV Subba Reddy) స్పందించారు. SIT విచారణపై తమకు నమ్మకం లేకనే..CBI విచారణను కోరామని గుర్తు చేశారు. CBI రిపోర్ట్ రాకముందే కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కూటమి నేతల తప్పుడు ప్రచారంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతువుల కోవ్వు కలవలేదని CBI రిపోర్ట్ ఇచ్చిందన్నారు. తామ నిలిపివేసిన నాలుగు ట్యాంకర్లకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. ఆ నెయ్యితో లడ్డూలు చేశారని.. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Next Story