తల్లికి తల కొరివి పెట్టి రుణం తీసుకున్న కూతురు

by Vemula.Srinu Prasad |

కన్నకూతురే కొడుకుగా మారి తల్లికి దహన సంస్కారాలు నిర్వహించిన ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పంగూరులో జరిగింది....

తల్లికి తల కొరివి పెట్టి రుణం తీసుకున్న కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: కన్నకూతురే(Daughter) కొడుకుగా మారి తల్లి(Mother)కి దహన సంస్కారాలు(Cremation) నిర్వహించిన ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గం(Srikalahasti Constituency) ఏర్పేడు మండలం పంగూరు(Pangur)లో జరిగింది. స్థానిక సుబ్బరావయ్య, పుల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే పిల్లలు చిన్నగా ఉన్న సమయంలోనే తండ్రి సుబ్బరావయ్య మరణించారు. దీంతో అన్నీ పిల్లలకు తల్లి పుల్లమ్మ తానే అయింది. ఏ కష్టం తెలియకుండా తన కుమార్తెలను సాకి పెద్ద చేసింది. చిన్న కుమార్తె భారతీ పీలేరులో టీచర్‌గా పని చేస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో తల్లి పుల్లమ్మ చనిపోయారు. దీంతో కుమారులు లేక పోవడంతో చిన్న కుమార్తె భారతి దహన సంస్కాలు నిర్వహించారు. తల్లికి తలకొరివి పెట్టి చిన్న కుమార్తె భారతి రుణం తీర్చుకున్నారు.

Next Story