వైభ‌వంగా గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 15:27:17  IST  )

తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి...

వైభ‌వంగా గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణి(Tirupati Govindaraja Swamy Temple Pushkarini)లో ఏడు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు(Thoppostavalu) ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు ద‌ర్శనం ఇచ్చారు.

Next Story