- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ
శ్రీవారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

X
దిశ,తిరుమల:శ్రీవారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..శ్రీవారి దయతో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కొందరు అధికారంలో ఒకలా లేకుంటే మరోలా నాయకులు ఉండటం సహజమేనన్నారు.ఇలాంటివి ఎన్నో కేసీఆర్ చూశారని గుర్తు చేశారు.ఒకరిద్దరు వెళ్లినా..పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు.
Read More..
Next Story






