- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాజకీయ ప్రముఖులు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాజకీయ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

X
దిశ,తిరుమల:శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాజకీయ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వీరిలో తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ సునీత తదితరులు కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా,ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపల హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి.మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.అలాగే సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మా చెల్లెల్ని సైతం ప్రజలు ఆదరించి,గెలిపించాలని శ్రీవారిని ప్రార్ధించామన్నారు.
Read More..
Next Story






