Ap: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-15 18:00:07  IST  )

చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు...

Ap: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు(Chittoor) జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ(Tdp) కార్యకర్త హత్యకు గురయ్యారు. కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ, ఆయన కుమారుడు సురేశ్‌పై మాజీ వాలంటీర్(Former Volunteer) వెంటకరమణ కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రీకొడుకులకు త్రీవ గాయాలయ్యాయి. దీంతో వారిని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. తండ్రి రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతి(Tirupati) ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో రామకృష్ణ మృతి చెందారు. సురేశ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కృష్ణాపురంలో ఆందోళనకు దిగారు. నిందితుడు వెంకట రమణను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ వాలంటీర్ వెంకట రమణకు రామకృష్ణకు పాత గొడవులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం రామకృష్ణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు

READ MORE ...

Ranya Rao: డీఆర్ఐ అధికారులపై నటి రన్యారావు సంచలన ఆరోపణలు


Next Story