- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: టీడీపీకి బిగ్ షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సొంత జిల్లాలో టీడీపీ(Tdp)కి బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సొంత జిల్లాలో టీడీపీ(Tdp)కి బిగ్ షాక్ తగిలింది. పలమనేరు రూరల్ పరిధి కొలమాసన సెగ్మెంట్-2(Kolamanasa segment-2) ఎంపీటీసీ లక్ష్మీనారాయణ(MPTC Lakshminarayana) రాజీనామా చేశారు. ఎంపీడీవో ఖాదర్ బాషాకు రాజీనామాను ఆయన అందజేశారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జడ్పీటీసీగా గెలుపొందారు. మంచి వ్యక్తి, బాగా చదువుకోవడంతో ప్రజలు ఆయనను గెలుపించుకున్నారు. ఏమైందో ఏమోగాని తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా చేశారు.
అయితే పలమనేరు రూరల్ కొలమాసన సెగ్మెంట్-2లో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా రెండు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జడ్పీటీసీ అయిన లక్ష్మీనారాయణకు కొందరు సహకరించడంలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది.






