Minister Pinipe Viswarup :'స్వామివారు పునర్జన్మ ప్రసాదించారు'

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-11-28 15:03:35  IST  )

రాష్ట్ర మంత్రి పినేపి విశ్వరూప్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Minister Pinipe Viswarup :స్వామివారు పునర్జన్మ ప్రసాదించారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర మంత్రి పినేపి విశ్వరూప్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి‌ని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ సిబ్బంది శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల బై పాస్ సర్జరీ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. పునర్జన్మ ప్రసాదించిన శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి విశ్వరూప్ అన్నారు.

ఇవి కూడా చదవండి

బాలినేని నైరుతికి.. వైవీ ఈశాన్యానికి

Next Story