- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala News:రద్దీకి తగ్గట్టుగా లడ్డూ కౌంటర్‌లో సిబ్బందిని నియమించాలి: టీటీడీ ఈవో
శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల పై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ ప్రామాణికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు.

దిశ,తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల పై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ ప్రామాణికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ పై వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందిస్తున్న సేవలు, లగేజీ, కళ్యాణకట్ట, వైద్యం, పారిశుధ్యం, పరిశుభ్రత, విజిలెన్స్, ట్రాన్స్ పోర్ట్ తదితర అంశాలపై భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనం లో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా క్రమపద్దతిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం, వంట సరుకుల నాణ్యత పరీక్షించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించి భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని కోరారు. వసతి గృహాలలో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెపక్షన్, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్.ఎమ్. ఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
భక్తుల రద్దీ సమయాల్లో లడ్డు కౌంటర్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం చేయకుండా లడ్డూలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి తగ్గట్టుగా లడ్డు కౌంటర్‌లలో సిబ్బందిని నియమించాలన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో రవాణా వ్యవస్థ మీద విజిలెన్స్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నిఘాను మరింత పెంచాలని , కల్యాణకట్టలో విజిలెన్స్ విభాగం, కల్యాణకట్ట విభాగాలు మరింత సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని సూచించాలన్నారు.
తిరుమలలో ఉచిత బస్సు సేవలపై భక్తులకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, శ్రీవారి సేవకులను నియమించి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి పరిపాలనా భవనం నుంచి జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీ కృష్ణ, సీఈ టీవీ సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.






