చిత్తూరు జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు.. యువకుడు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-04 12:09:20  IST  )

చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. తుమ్మదపాలెంకు చెందిన సాయికుమార్‌ను యువకుడు ఢిల్లీ నాటుతుపాకీతో కాల్చారు. ఈ కాల్పుల్లో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు...

చిత్తూరు జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు.. యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor)లో కాల్పులు(Firing) కలకలం రేగింది. తుమ్మదపాలెంకు(Thummadapalem)చెందిన సాయికుమార్‌ను నాటు తుపాకీ(Pistol)తో యువకుడు డిల్లీ కాల్చారు. ఈ కాల్పుల్లో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తుమ్మిండపాళ్యం గ్రామానికి చెందిన స్నేహితులు. జూదం ఆడుతుండగా వివాదం తలెత్తడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఢిల్తీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా సీసీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. మృతుడు, నిందితుడి మధ్య ఉన్న గత పరిచయాలపై ఆరా తీస్తున్నారు. త్వరగా కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

ఎప్పుడు లేని తుపాకీ కల్చర్..

అయితే ఈఘటనలో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు లేని తుపాకీ కల్చర్ ఇక్కడికి కూడా సైతం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికుమార్ పై జరిపి కాల్పుల వెనుక అసలు కారణాలేంటో పోలీసులు గుర్తించాలని సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాయికుమార్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని సూచించారు.

Next Story