రోజా ఇలాకాలో పోలీసులకు ఏడు అత్యాధునిక డ్రోన్లు

by Bhoopathi Nagaiah |

మాజీ మంత్రి రోజా ఇలాకా నగరిలో పోలీసులకు అత్యాధునీక డ్రోన్లను సర్కార్ మంజూరి చేసింది. నేరాలకు కళ్లెం వేసేలా పోలీసులను ఈ డ్రోన్లను వినియోగించనున్నారు.

రోజా ఇలాకాలో పోలీసులకు ఏడు అత్యాధునిక డ్రోన్లు
X

దిశ, చిత్తూరు: నేర నియంత్రణలో సాంకేతికతను జోడించి, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీసు శాఖ సిద్ధమైంది. సీఎస్ఆర్ నిధుల ద్వారా సమకూరిన 7 కొత్త డ్రోన్లను ఎస్పీ తుషార్ డూడి మంగళవారం నగరి సబ్-డివిజన్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నగరి సబ్-డివిజన్ పరిధిలోని సరిహద్దులు, అటవీ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలపై నింగి నుండి నిరంతరం నిఘా ఉంచేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. సభలు, ఉత్సవాల్లో జనసమూహాన్ని పర్యవేక్షించడంతో పాటు, ట్రాఫిక్ జామ్‌లను తక్షణమే గుర్తించి క్లియర్ చేయడానికి ఇవి దోహదపడతాయన్నారు. అక్రమ మద్యం, గంజాయి, ఇసుక రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను డ్రోన్ల సాయంతో వేగంగా పసిగట్టి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో ప్రజల భద్రతను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు.

Next Story