- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. కోటి విలువైన దుంగల గుర్తింపు
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఉస్తికాయలపెంట -ఎల్లమంద క్రాస్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు...

X
దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఉస్తికాయలపెంట -ఎల్లమంద క్రాస్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. రెండు బైకులు, రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ షేక్ షేపులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పారిపోయారు. పట్టుబడ్డ నిందితుడు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా, ఉత్తన్ గారైకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రిమాండ్‌కు తరలించారు. ఎర్రచందనం పరిరక్షణ అందరి బాధ్యత అని, అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు.
Next Story






