kidney racket case: ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం ముమ్మరంగా గాలింపు

by Vemula.Srinu Prasad |

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు..

kidney racket case: ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం ముమ్మరంగా గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు(Madanapalle kidney racket case)లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నీ మార్పిడి చేసిన ఏ2 డాక్టర్ పార్థసారథి పరారీలో ఉండటంతో ఆయన కోసం గాలిస్తున్నారు... డాక్టర్ పార్థసారథి బెంగళూరు(Bengaluru)లో ఉన్నట్లు సమాచారం అందడంతో 4 పోలీస్ బృందాలు అక్కడి వెళ్లి గాలిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా పార్థసారథిని పట్టుకుని మదనపల్లికి తీసుకురానున్నారు. అయితే ఈ కేసులో నిన్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

Next Story