తిరుమల క్యూలైన్లలో చోరీలు.. ఆరుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 08:12:03  IST  )

తిరుమల క్యూలైన్లలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు..

తిరుమల క్యూలైన్లలో చోరీలు.. ఆరుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) క్యూలైన్ల(Q Lines)లో భక్తులే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చి క్యూలైన్లలో వేచివున్న భక్తుల మెడల్లోని గొలుసులు, సెల్ ఫోన్లను కొంతకాలంగా ఆరుగురు వ్యక్తుల ముఠా చోరీలకు పాల్పడుతోంది. భక్తుల ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్యూలైన్లలోని సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు. భక్తుల బంగారు చైన్లు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తిరుమల సన్నిధిలో భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Next Story