Hyd: జనసేన రాజకీయ విధానంపై పవన్ కీలక నిర్ణయం.. ఆ జిల్లా నేతలకు దిశా నిర్దేశం

by Vemula.Srinu Prasad |

కులాలను కలిపే రాజకీయ విధానమే జనసేన సిద్దాంతమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. .

Hyd: జనసేన రాజకీయ విధానంపై పవన్ కీలక నిర్ణయం.. ఆ జిల్లా నేతలకు దిశా నిర్దేశం
X

దిశ, తిరుపతి: కులాలను కలిపే రాజకీయ విధానమే జనసేన సిద్దాంతమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. హైదారాబాద్‌లో పవన్ కళ్యాణ్‌తో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రాజకీయాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కులాలను కలిపే రాజకీయ విధానంతో, మతాల ప్రస్తావన లేని రాజకీయ సిద్దాంతంతో జనసేన పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. అక్రమ కేసులపై ఆరా తీశారు. జనసైనికులకు అండగా ఉంటామని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయాలపై అధినేత పవన్ కళ్యాణ్‌కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు.

Next Story