Nara lokesh Yuvagalam: నారా లోకేశ్ వాహనం సీజ్.. స్వల్ప ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
Nara lokesh Yuvagalam: నారా లోకేశ్ వాహనం సీజ్.. స్వల్ప ఉద్రిక్తత
X

దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. దీంతో ఆయన చేస్తున్న యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నారా లోకేశ్ పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం పలమనేరు పట్టణంలో లోకేశ్ పాదయాత్రను కొనసాగించారు. ఒక చోట వాహనంపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో ఆయన వేదికగా ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

అయితే తన వాహనం వదిలితే కానీ ముందుకు వెళ్లనని లోకేశ్ రోడ్డుపై నిలబడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ నిర్వహించడానికి అనుమతి లేదని చట్ట ప్రకారం సీజ్ చేశామని పోలీసులు వివరించే ప్రయత్నం చేసినా లోకేశ్ ఒప్పుకోలేదు . జనం కోరిన చోట్ల స్టూల్ వేసుకుని మరీ నిలబడి మాట్లాడి వెళ్తున్నానని, పలమనేరులో జనం ఎక్కువగా ఉన్నందున రోడ్డు పక్కగా వాహనంపైకి ఎక్కి కొంతసేపు మాట్లాడానని లోకేశ్ తెలిపారు. ముఖ్యమంత్రిపై పరుష పదంతో దూషించానని అంటే చంద్రబాబు సీఏంగా ఉన్నప్పుడు కాల్చి పారేయాలని, ఉరి తీయాలని, బంగాళాఖాతంలో పారేయాలని అన్న వ్యాఖ్యల కన్నా ఏమీ ఎక్కువగా మాట్లాడలేదని లోకేశ్ వాదించారు. ఊరు దాటి వెళుతుంటే వాహనం సీజ్ చేయడం ఏంటని...?, ఆ వాహనాన్ని వదిలేదాకా అక్కడే ఉంటానని స్పష్టం చేశారు . చివరకు ఆ వాహనాన్ని పోలీసులు వదిలి వేయడంతో లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు.

ఇవి కూడా చదవండి:

Mla Kotamreddy అంతు తేల్చే పనిలో సీఎం జగన్.. రంగంలోకి ఇంటెలిజెన్స్


Next Story

Most Viewed