Nara Lokesh Setires: గజినీకి మారు పేరు సీఎం జగన్

by srinivas |
Nara Lokesh Setires: గజినీకి మారు పేరు సీఎం జగన్
X

దిశ, తిరుపతి: మతి మరుపునకు, గజినీకి మారు పేరు సీఎం జగన్ అని లోకేశ్ ​ఎద్దేవా చేశారు. లోకేశ్ 22వ రోజు యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగింది. రాజీవన్‍ నగర్‌లో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. యువగళం దెబ్బకు జగన్‌కు జ్వరం వచ్చిందని విమర్శించారు. రాజధానిపై గజిని సీఎం ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నాడని ఆరోపించారు. గజిని సీఎం పబ్లిసిటీలో పీక్.. అసలు విషయంలో వీక్ అంటూ ఎద్దేవా చేశారు. తమ పాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునే పోలీసులకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. శ్రీకాళహస్తిశ్వరుని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపొవడం దారుణమన్నారు. జగన్​కు భయమెంటో చూపిస్తానని... అమూల్ బేబీకి తాను యముడినని ఎద్దేవా చేశారు. తన మైకు లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని.. సీఎం గజిని కాబట్టి మర్చిపోయారని లోకేశ్ సెటైర్లు వేశారు.

Also Read...

Breaking: చంద్రబాబు సభలో స్పృహ కోల్పోయిన కార్యకర్త

Next Story

Most Viewed