Hello Lokesh: జగన్ జైలుకెళ్తే.. పెద్దిరెడ్డి సీఎం!

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-04 13:52:53  IST  )

జగన్ జైలుకు వెళితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు..

Hello Lokesh: జగన్ జైలుకెళ్తే.. పెద్దిరెడ్డి సీఎం!
X

దిశ, తిరుపతి: జగన్ జైలుకు వెళితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లిలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా కల్లూరులో ‘హలో లోకేశ్‍’ కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులు, యువతతో ముఖాముఖి మాట్లాడారు. పుంగనూరులో పరిశ్రమలు రాకపొవడానికి కారణం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అని లోకేశ్‍ ఆరోపించారు.

టీడీపీని గెలిపిస్తే పుంగనూరులో పరిశ్రమలను తీసుకవచ్చే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్‍ తెలిపారు. జగన్‍ రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా చిత్తూరు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమ పద్దతిలో జాబ్‍ క్యాలెండర్‍ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు, ఓసీల్లో ఉన్న పేదవారికి కార్పొరేషన్లు పునరుద్ధరించి స్వయం ఉపాధి లభించేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Also Read...

జైలుకెళ్లొచ్చినా తగ్గేదేలే అంటున్న పట్టాభి.. రిటర్న్ గిఫ్ట్ పక్కా అంటూ వార్నింగ్

Next Story