- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది శాడిజం జగన్ రెడ్డి: Nara Lokesh Selfie Raging
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్లు చేసిన పాపమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. క్యాంటీన్ ముందు అన్నా అని పేరుండడమే వాటి పాలిట శాపమైందా? అని యువగళం పాదయాత్రలో ఆయన నిలదీశారు...

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్లు చేసిన పాపమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. క్యాంటీన్ ముందు అన్నా అని పేరుండడమే వాటి పాలిట శాపమైందా? అని యువగళం పాదయాత్రలో ఆయన నిలదీశారు. మదనపల్లెలో అన్నా క్యాంటీన్ దగ్గర సెల్ఫీ తీసుకుని మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రంగులు మార్చారని, తాళాలు వేశారని, చివరికి మూతేశారని మండిపడ్డారు. పేదల నోటికాడ కూడు లాగేయడాన్ని శాడిజం అంటారు జగన్ రెడ్డి! అని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్ పేరు నచ్చలేదంటే..పేదల్ని జలగల్లా పీల్చేస్తున్న తమ దుర్మార్గ పాలనకి గుర్తుగా జలగన్న క్యాంటీన్లు అని పేరు మార్చి నడిపినా పేదల ఆకలి తీరేదని చెప్పారు. ‘మదనపల్లెలో మూతపడిన అన్నా క్యాంటీన్ ఇది. ఎంతమంది ఆకలితో అన్నా క్యాంటీన్ వైపు చూసి నువ్వు వేసిన తాళాలు వెక్కిరిస్తుంటే నిరాశగా వెళుతున్నారో?.’ అంటూ లోకేశ్ సెల్ఫీ తీసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.






