- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట తప్పని Nara Lokesh.. హమీద్ బాషాకు కొత్త ఆటో అందజేత
by Vemula.Srinu Prasad |
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు..

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. ఆటో కొనిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీంతో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. నగరికి చెందిన హమీద్ బాషా ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవలే టీడీపీ మహిళా నేతలు Hamid Basha ఆటోలో మంత్రి రోజా ఇంటికి వెళ్లారు. ఆమెకు చీరగాజులు ఇచ్చేందుకు వెళ్లగా పలువురు మహిళలను అరెస్ట్ చేశారు. మహిళలు వచ్చిన హమీద్ బాషాకు చెందిన ఆటోను సీజ్ చేశారు పోలీసులు.
దీంతో తన జీవనోపాధి కోల్పోయానంటూ లోకేశ్ వద్ద హమీద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారంలో కొత్త ఆటో ఇస్తానని లోకేశ్ ప్రామిస్ చేశారు. అన్నట్లుగానే హమీద్ బాషాకు కొత్త ఆటోను లోకేశ్ అందజేశారు. దీంతో హమీద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేకుండా పోయయాయి.
Next Story






