- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడిదిలో బసకు మినహాయింపు ఇవ్వండి.. సీఈసీని కోరిన Nara lokesh
అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు...

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నందున స్థానికంగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2013లో చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రకు ఇచ్చిన మినహాయింపును ఎన్నికల సంఘం దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు.
తూర్పుగోదావరి జిల్లాలో తమ అధినేత చంద్రబాబు పాదయాత్రకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండాలా వద్దా అనే దానిపై నారా లోకేశ్ ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికోడ్ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా నుంచి వెళ్లిపోవాలని రెవెన్యూ అధికారులు నోటీసులివ్వడంతో ఎన్నికల సంఘానికి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.






