Mla Varaprasad: వైఎస్ జగన్ మాటిచ్చారు.. త్వరగా పూర్తి చేయండి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-02 15:04:07  IST  )

గూడూరు వద్ద ఫ్లెఓవర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు విజ్ఞప్తి చేశారు. ...

Mla Varaprasad: వైఎస్ జగన్ మాటిచ్చారు.. త్వరగా పూర్తి చేయండి
X

దిశ, గూడూరు: గూడూరు వద్ద ఫ్లెఓవర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు ఫ్లైఓవర్‌కి జీవో వచ్చినా కొన్ని సాంకేతిక కారణాలవల్ల కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదని తెలిపారు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోతున్నాయని, ప్రజలు ఆ ఫ్లై ఓవర్‌ను త్వరగా ప్రారంభించమని కోరుతున్నారని వరప్రసాద్ కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ వెంటనే పూర్తి చేస్తామని గూడూరు ప్రజలకు మాట ఇచ్చారని వరప్రసాద్ గుర్తుచేశారు.

Next Story