- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. రోజువారి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






