- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madanapalle | టమోటా ధరలకు రెక్కలు
మదనపల్లె మార్కెట్ (Madanapalle Market) లో టమోటా (Tomato) ధరలకు రెక్కలొచ్చాయి

X
దిశ, వెబ్ డెస్క్ : మదనపల్లె మార్కెట్ (Madanapalle Market) లో టమోటా (Tomato) ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా ధర రూ.63కి చేరడంతో కొనుగోలుదారులు నోర్లు వెల్లబెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేవలం పది రూపాయలకు కిలో పలికిన టమోటా ధరలు.. ఒకేసారి 63 రూపాయల వరకు ధర పలకడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం టమోటా ధరలేనా.. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఉరిమి చూస్తాయా అనుకుంటూ వాపోతున్నారు. అయితే మదనపల్లె మార్కెట్ కు ఇప్పటి వరకు 140 మెట్రిక్ టన్నుల టమోటా వచ్చింది. వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గిన నేపథ్యంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధర పలకనప్పుడు రైతులు టమోటా పంటను నేలపాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
Next Story






