- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madanapalle : చనిపోయిన చిన్నాన్నతో మాట్లాడాలని శవం వెలికితీసే యత్నం
కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరిగెడుతున్నా.. మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒక దగ్గర తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరిగెడుతున్నా.. మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒక దగ్గర తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లె మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మదనపల్లె (Madanapalle) మండలానికి చెందిన దిలీప్ రావ్ అనే యువకుడు బెంగళూరులో నవంబరు 1న మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి అతని పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె మార్గంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవం పూడ్చిన దగ్గరకు వచ్చి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన సమీపంలోని పశువుల కాపర్లు అతడిని హెచ్చరించారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొంత సేపటికి మళ్లీ వచ్చి... చిన్నాన్నతో మాట్లాడాలని
కొద్ది సమయానికి సదరు వ్యక్తి మళ్లీ దిలీప్ రావ్ ను పూడ్చిన చోటకు వచ్చాడు. చుట్టూ ఎవరు లేనిది గమనించి మళ్లీ శవాన్ని బయటకు తీసేందుకు తవ్వడం ప్రారంభించాడు. అదే సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. శవాన్ని బయటకు తీయడాన్ని గమనించి ఆగ్రహానికి గురయ్యారు. శవాన్ని ఎందుకు బయటకు తీస్తున్నావని గట్టిగా ప్రశ్నించారు. అయినా సదరు వ్యక్తి నుంచి సమాధానం రాకపోవడంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. ఆ వ్యక్తికి నాలుగు తగిలించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తన పేరు గోవింద్ గా పేర్కొన్నాడు. తను జైపూర్ నుంచి వచ్చి మదనపల్లెలో ఉంటున్నట్లు తెలిపాడు. తన చిన్నాన్న మహేశ్ ఇటీవల మరణించాడన్నాడు. అతనితో మాట్లాడుతూ దిలీప్ రావ్ శవాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. అందుకోసం తాంత్రిక ప్రయోగాలకు (Black Magic) యత్నించినట్లు వెల్లడించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం.






